Top 5 Genius Saving Tips by Buffett!
Top 5 Genius Saving Tips by Buffett! ప్రతి వ్యక్తికీ ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరమని ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ యువతకు సూచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ డబ్బు ఖర్చు చేయకూడదో తెలిసినవారే నిజమైన పొదుపరులని ఆయన అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, “ఖర్చు చేసిన తరువాత మిగిలినదాన్ని పొదుపు చేయడం కాదు, మొదట పొదుపు చేసి తరువాత మిగిలిన డబ్బుతో ఖర్చు చేయాలి” అనే ఆలోచన కలవారే మంచి ఆర్థిక శాస్త్రాన్ని పాటించే వారు అని బఫెట్ ఉద్ఘాటించారు. ఆ విషయాలను మీ కోసం ఇక్కడ వివరించాం!

సొంతింటి కల – ఆలోచించి నిర్ణయం: చిన్న కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు చాలిపోతుందని, కానీ డబ్బు ఉంది కదా అనో, లేదా బంధుమిత్రుల ముందు గొప్పగా కనిపించాలనే కోసమో మూడు లేదా నాలుగు బెడ్రూంల ఇల్లు కొనడం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అవసరానికి మించిన ఇల్లు కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన మెయింటెనెన్స్, ట్యాక్స్‌లు, ఈఎంఐ లాంటి ఖర్చులు భారీగా పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.
క్రెడిట్ కార్డులు – అప్రమత్తత అవసరం: షాపింగ్ కోసం క్రెడిట్ కార్డును ఉపయోగించడం ఎంత సులభమో, నెలాఖరులో ఆ బిల్లు పూర్తిగా చెల్లించడం అంత కష్టమైన పని అని గుర్తుంచుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. తెలివిగా మరియు పద్ధతిగా వాడితే క్రెడిట్ కార్డుతో మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
వాహన రుణాలు – విలువ తగ్గే పెట్టుబడి: కారు ఒకసారి షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దాని విలువ తగ్గడం ప్రారంభమవుతుంది అనే విషయాన్ని గుర్తించాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా, ఐదు సంవత్సరాల వ్యవధిలో ఒక కారు విలువ సుమారుగా 60 శాతం వరకూ తగ్గిపోతుందని చెబుతారు. అంటే, కారుపై పెట్టిన డబ్బు వాడకంలో ఉంటే తప్ప పెట్టుబడిగా మారదని అర్థం.
Also Read: Legandarywood Sreeleela’s 7 Stunning Looks in Junior! – Legandarywood
వారెన్ బఫెట్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుచేస్తూ, మన పెట్టుబడులు ఎప్పుడూ వారి విలువ పెరిగే వస్తువులపై ఉండాలని, విలువ తగ్గే వస్తువులపై కాకూడదని సూచించారు. తనకు రోజుకో కొత్త కారులో తిరిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, బఫెట్ ఇప్పటికీ 2014లో కొనుగోలు చేసిన కారులోనే ప్రయాణిస్తుంటారు. విశేషమేమిటంటే, ఆ కారు ఆయన డిస్కౌంట్లో కొనుగోలు చేశారని చెబుతారు!
జూదం: జూదంలో గెలిచే అవకాశం అత్యంత తక్కువగా ఉంటుందని వారెన్ బఫెట్ స్పష్టంగా తెలిపారు. అదృష్టం అనేది కొన్ని కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే కలిసొస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. జూదం ద్వారా పోగొట్టుకోవడం తప్ప, స్థిరమైన లాభాలు సాధ్యం కావు అని హెచ్చరించారు. అందుకే, జూదానికి పూర్తిగా దూరంగా ఉండాలి అని సలహా ఇచ్చారు.
Also Read: Legandarywood Does Dollar Dreams down by Trump 2 Tariffs! – Legandarywood
సొంత అవగాహనతో పెట్టుబడులు: ఎవరైనా చెప్పారనే కారణంతో, మీకు అర్థం కాని పథకాల్లో పెట్టుబడి చేయకూడదని బఫెట్ హెచ్చరిస్తున్నారు. మీరు పెట్టుబడి చేస్తున్న పథకం గురించి మీకే స్పష్టత లేకపోతే, మీరు మీ డబ్బును ప్రమాదంలో పెట్టినట్లేనని చెప్పారు.
సూచన: “ఎక్కువ రిటర్న్” అన్న పదం వెనుక ఎక్కువ రిస్క్ దాగి ఉంటుంది అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని బఫెట్ సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
For more help, please visit the Warren Buffett – Wikipedia website to find more details.