Coolie Review! 2 Characters Shine Bright
Coolie Review! 2 Characters Shine Bright: సూపర్ స్టార్ రజనీకాంత్, అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, కన్నడ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన కూలీ సినిమాకు ఈరోజు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే, వీరి నలుగురి కంటే సినిమాలో మరో ఇద్దరి పాత్రలు ప్రత్యేకంగా మెప్పించాయి. అవి సౌబిన్ సాహిర్, రచిత రామ్ పాత్రలు.
Also Read: Legandarywood Pak Grandson $7B Remarkable Journey in India – Legandarywood
దర్శకుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) సినిమా అంటే మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టూ కథ తిరుగుతుందనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా, లోకేష్ తన నమ్మిన పాయింట్‌కి ఎమోషన్స్ జోడించి పాత కథనే కొత్తగా చెప్పాడు. దీంతో ఈ సినిమాలో రజనీ చరిష్మా తప్ప కొత్తదనం ఏమీ లేదని సినిమా ఆరంభంలోనే స్పష్టమవుతుంది.

ఉపేంద్ర లాంటి మాస్ హీరోను కేవలం రజనీకాంత్‌ను భజన చేసే పాత్ర కోసం ఉపయోగించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అలాంటి రోల్ కోసం ఉపేంద్ర లాంటి స్టార్ పర్ఫార్మర్ను తీసుకోవాల్సిన అవసరం లేదనిపించింది. దీంతో ‘కూలీ’ సినిమాలో ఆయనకు వచ్చిన పాత్రను చూసి ఉప్పి ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
Also Read: Legandarywood 5 Amazing Benefits of Onion by Your Bed! – Legandarywood
అక్కినేని నాగార్జున ‘సిమాన్’గా క్రూరమైన విలన్‌గా రఫ్ ఆడిస్తారని ఆయన అభిమానులు అనుకున్నారు. నాగ్ చేసిన ఓ ఫైట్ సీన్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. లీక్ అయ్యిందనడం కంటే లీక్ చేశారనడం కరెక్ట్. ఆ సీన్‌తో ‘కూలీ’కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ‘విక్రమ్’లో రోలెక్స్‌లా పవర్‌ఫుల్‌గా నాగ్ కనిపిస్తారని ఆశించిన ఫ్యాన్స్, సినిమాలో ఆయన రోల్ విలన్ కంటే తక్కువ, జోకర్ కంటే ఎక్కువగా అన్నట్టుగా ఉంది.

అలాగే, సినిమా రిలీజ్‌కి ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ రోల్‌పై చాలా హైప్ క్రియేట్ చేశారు. గ్లోబల్ క్రిమినల్ సిండికేట్‌గా ఆయన కనిపించినా, రోల్ మాత్రం ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేదు. దీనికి తోడు ఆమీర్ ఖాన్ తండ్రిగా షారుక్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. సరైన కథలేని సినిమాలో ఇంతమంది స్టార్లు ఎందుకు ఉన్నారో అభిమానులకు అర్థం కావడం లేదు.
Also Read: Legandarywood Was Beetroot Salad Juice Harmful for health! – Legandarywood
గమనిక: సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం దక్కడంతో, లోకేశ్ కనగరాజ్ కథ కంటే కేమియోలతో నింపాలని అనుకున్నాడా? అన్న అనుమానం అభిమానుల్లో కలిగింది. అందుకే అన్ని ఇండస్ట్రీల నుంచి సీనియర్ స్టార్లను తీసుకువచ్చాడా? అని సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేశారు. అయితే, రజనీ ఎప్పటిలానే తన యాక్టింగ్‌తో కొన్ని సీన్స్‌లో మాయాజాలం చేసి సినిమాకు కొంత ఊపిరి పోశారు.
For more help, please visit the Coolie (2025 film) – Wikipedia website to find more details.